telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నయనతార బర్త్ డే స్పెషల్ : ‘నెట్రికన్’ టీజర్ రిలీజ్‌

నయనతార లేడీ రోల్‌ చాలా సినిమాలు తీసింది. దీంతో నయనతార ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. లేడి సూపర్‌ స్టార్‌గా నయన్‌ తన కెరీర్‌ను ఇంకా హై రేంజ్‌ తీసుకుంది. అయితే… ఇవాళ నయనతార 36వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ, అభిమానులు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో నయనతార ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ తన ప్రేయసి నయన్‌కు బర్త్ డే విషెష్‌ చెప్పాడు. అయితే… నయనతార బర్త్ డే సందర్భంగా “నెట్రికన్‌” మూవీ టీజర్‌ విడుదల చేశారు. నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా తమిళ్‌ మూవీ “నెట్రికన్‌”. రౌడీ పిక్చర్స్‌ బ్యానర్‌పై నయన్‌ బాయ్‌ ఫ్రెండ్‌ విఘ్నెష్‌ శివన్‌ ఈ చిత్రాన్ని నిర్మించాడు. గృహం సినిమాతో అందరి ప్రశంసలు అందుకున్న మిలింద్‌ రౌ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. నయనతార బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు ఈ సినిమా యూనిట్‌. మర్డర్‌ మిస్టరీ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో నయనతార అంధురాలిగా ఛాలెంజింగ్‌ రోల్‌లో కనిపించబోతోంది నయనతార.

Related posts