telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

తెలుగు రాష్ట్రాలకు కరెంటు సరఫరా నిలిపివేత.. బకాయిలే కారణం.. ఎన్టీపీసీ

ntpc notices to stop current supply to

ఎన్టీపీసీ దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఫిబ్రవరి 9 నుంచి విద్యుత్‌ సరఫరాను నిలిపేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ‘విద్యుత్‌ సరఫరా నియంత్రణ’ నోటీసులను ఎన్టీపీసీ ఆయా రాష్ట్రాలకు జారీ చేసింది. గత రెండు నెలల పైబడి బకాయిలు చెల్లించకపోవటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్టీపీసీ తెలిపింది.

ఎన్టీపీసీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి రూ.7,859కోట్ల బకాయిలు పెండింగ్‌లు ఉన్నాయని వెల్లడించింది. ఇందులో అగ్ర భాగం రూ. 4,890 కోట్లు బకాయిలు కేవలం ఈ మూడు రాష్ట్రాల నుంచే రావాల్సి ఉందని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్‌ తర్వాతి స్థానంలో ఉందన్నారు. కేంద్ర విద్యుత్‌ శాఖ పోర్టల్‌లో పేర్కొన్న సమాచారం మేరకు.. ఎన్టీపీసీకే కాకుండా ఇతర విద్యుత్ సరఫరా కంపెనీలకు ఉత్తరప్రదేశ్‌ రూ.6,127 కోట్లు బకాయి పడింది. రాజస్థాన్‌ రూ.2404 కోట్లు, పంజాబ్‌ రూ.1,041 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది.

Related posts