వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ “మర్డర్” అనే టైటిల్ తో ఫాదర్స్ డే సందర్భంగా ఓ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్ విడుదల చేసిన అనంతరం వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమృత పేరుతో సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు ప్రచారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేసారు. “అమృత చేసినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వ్యాఖ్యలపై నేను సమాధానం చెప్పాలని అనుకుంటున్నా. తాను, తన తండ్రి కథతో ‘మర్డర్’ పేరిట నేను సినిమా తీస్తున్నానని తెలుసుకుని ఆమె ఆత్మహత్య చేసుకోవాలని భావించారట. అమృతే రాసిందనుకున్నా లేదా ఓ పనిలేని వాడు రాసినా, నేను ‘మర్డర్’లో ఏం చూపించబోతున్నానన్న విషయంలో అనవసరపు ఆందోళనలతో ఉన్న వారి పట్ల స్పందించడం నా విధి అని భావిస్తున్నాను” అంటూ ట్వీట్ చేసారు. అనంతరం మరో ట్వీట్ చేసిన ఆయన “ఓ జర్నలిస్ట్ వార్త రాసినా, ఓ విచారణ అధికారి విచారించినా, ఎవరైనా అనుమానాలు వ్యక్తం చేసినా, అది వారివారి ఆలోచనల మేరకు ఉంటుంది. ఓ ఫిల్మ్ మేకర్ గా ‘మర్డర్’ విషయంలో నా ఆలోచన నాది. నా స్వీయ ఆలోచనతో సినిమా తీసే హక్కు నాకుంది. అమృత కామెంట్లే అయినా, మరెవరు రాసినా, నా ఫైనల్ మెసేజ్ ఇదే. ఎంతో బాధను అనుభవించిన వారి పట్ల నాకెంతో గౌరవం, సానుభూతి వున్నాయి. ‘మర్డర్’ ఎవరినీ అగౌరవపరచబోదు” అంటూ వర్మ వరుస ట్వీట్లు చేసారు.
previous post
next post
ప్రభాస్తో కప్పు కాఫీ తాగినా చాలు: దివి