telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ ప్రజలకు కేటీఆర్ శుభవార్త

మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించి పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంపై ఒత్తిడి తేవాలని 2008 లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎమ్మెల్యే పదవికి లక్ష్మారెడ్డి రాజీనామా చేసారని.. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ది చెందుతోందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాక మునుపు, తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులను బేరీజు వేసుకోవాలని..టీడీపీ, కాంగ్రెస్ హయాంలో పెన్షన్ల కోసం యుద్దం చేసే పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 40 లక్షల మంది కి పెన్షన్లిస్తున్నామని..త్వరలో కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఏప్రిల్ , మే నెలల్లో కరెంటు కోతలుండేవి… ఇపుడు 24 గంటల కరెంటుస్తున్నామని పేర్కొన్నారు. జడ్చర్ల తొలి మున్సిపల్ ఎన్నికల్లో 27 వార్డులను గెలుపును కానుకగా ఇవ్వండి, అభివృద్దిని చేసి చూపిస్తామని కోరారు కేటీఆర్. అంతే కాదు.. ప్రైవేట్ టీచర్లకు అండగా నిలబడ్డామని వెల్లడించారు.

Related posts