telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

కరోనా టెస్టుల పేరుతో పైశాచికత్వం… యువతి పట్ల ల్యాబ్ టెక్నీషియన్ వికృత చేష్టలు

Covid-19

కరోనా టెస్టుల పేరిట ఓ ల్యాబ్ టెక్నీషియన్ యువతి పట్ల వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఆమె జననాంగాల నుంచి నమూనాలు సేకరించాడు. విషయం బయటకు రావడంతో పోలీసులు అతడిపై అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా బధ్నరాలో ఈ దారుణం జరిగింది. బధ్నరాలో ఓ మాల్ లో పని చేసే వ్యక్తికి ఈ నెల 24న కరోనా రాగా అతడు తనని కలిసిన అందరికీ సమాచారం ఇచ్చాడు. కాంటాక్ట్ జాబితాలో ఉన్న ఓ యువతి తనూ కూడా కరోనా పరీక్ష చేయించుకునేందుకు నిర్ణయించుకుంది. ఈ నెల 28న కరోనా టెస్టు కోసం ఓ ల్యాబ్ కు వెళ్ళింది. అయితే ఫలితాలు కచ్చితంగా రావాలంటే జననాంగం నుంచి కూడా శాంపిల్ సేకరించాలని ల్యాబ్ టెక్నీషియన్ ఆమెని నమ్మించాడు. ఆ యువతి నిజమే అనుకుని అందుకు అంగీకరించింది. దీంతో అతడు ఆమె మర్మాంగం నుంచి శాంపిల్‌ను సేకరించి పైశాచికానందం పొందాడు. తరువాత ఆమె అనుమానం వచ్చి విషయాన్ని తన సోదరుడికి తెలిపింది. ఆశ్చర్య పోయిన అతడు డాక్టర్ల వద్ద ఈ విషయం ప్రస్తావించాడు. కరోనా శాంపిళ్లను జననాంగం నుంచి సేకరించరని వారు స్పష్టం చేశారు. దీంతో ఆమె మోసపోయిందని, ల్యాబ్‌లో దారుణం జరిగిందని అతడికి అర్థమైంది. వెంటనే ఆ యువకుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు ఆ కామాంధుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై అత్యాచారం నేరం కింద కేసు నమోదు చేసినట్లు బధ్నరా సీఐ పంజబ్ వంజారి తెలిపారు.

Related posts