telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనా సృష్టికర్త .. అమెరికానే .. ట్రేడ్ వార్ ఫలితం .. : రష్యా

china found vaccine for corona virus

కరోనా వైరస్ క్రియేట్ చేసింది ప్రపంచ అగ్ర రాజ్యం అమెరికానే అంటోంది రష్యా. వుహాన్ కరోనా వైరస్ వ్యాప్తితో చైనా ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా ఈ దారుణానికి ఒడిగట్టిందని పలువురు రష్యా శాస్త్రవేత్తలు, రాజకీయ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. అమెరికా పార్మాసెటికల్ కంపెనీల నుంచి భారీ మొత్తంలో చైనా అధిక లాభాలు పొందుతోందని, అందుకే డ్రాగన్ దేశాన్ని అస్థిరత పరిచేందుకు కరోనా వైరస్ అనే వ్యాధిని వ్యాప్తి చేసే బయో వెపన్ యూనైటెడ్ స్టేట్స్ క్రియేట్ చేసిందని నమ్ముతున్నారు. చైనాలో వుహాన్ సిటీ నుంచి కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకుతోంది. ఈ క్రమంలో రష్యా చైనాతో కలిపే తమ భూభాగ సరిహద్దులను మూసివేసింది.

రష్యా మీడియా వర్గాల ప్రకారం.. నోవల్ కరోనా వ్యాధి.. 2019-nCoV అనే ప్రాణాంతక వైరస్ అని.. చైనాను దొంగ దెబ్బ తీసేందుకు అమెరికా ఈ జీవాయుధాన్ని ప్రయోగించినట్టు నివేదించింది. ప్రధాన రష్యన్ మీడియాలో ఈ వాదనలు గణనీయంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలను కించపరిచేలా ఆ దేశ ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ ప్రయత్నాల్లో భాగంగా ఉండవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా, చైనాలకు ద్వైపాక్షికంగా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో 8వేల మందికి వైరస్ సోకగా, 170 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. కరోనా దెబ్బకు రష్యా కూడా చైనాతో కలిపే తమ సరిహద్దులను మూసివేసింది.

అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ గురించి అందరికి తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్య ఉద్రికత్తలకు దారితీసింది. అంతేకాదు.. సౌత్ చైనా తీర ప్రాంతం, 5G ఇంటర్నెట్ వంటి ఎన్నో వివాదాలు ఇరుదేశాల మధ్య చిచ్చురేపాయి. దీంతో ఆర్థికంగా అమెరికా నుంచి లాభాలు గడిస్తున్న చైనాను ఎలాగైనా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే అమెరికా ఈ చర్యకు పాల్పడి ఉంటుందని కొందరు రష్యన్లు అభిప్రాయపడుతున్నారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగానే అమెరికా ప్రభుత్వం తమ లక్ష్యాలను సాధించేందుకే ఈ దారుణమైన చర్యకు పాల్పడి ఉంటుందని రష్యన్లు నమ్మతున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మనుషులు సృష్టించిదేనని తాను విశ్వసిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితిలో బయోలాజికల్ అండ్ కెమికల్ వెపన్స్ మాజీ సభ్యుడు ఇగోర్ నికులిన్ అభిప్రాయపడ్డారు. చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలంటే.. డ్రాగన్ దేశానికి వుహాన్ సిటీ కేంద్ర బిందువు. ట్రాన్స్ ఫోర్టేషన్ హబ్ అని కూడా పిలుస్తారు.

Related posts