telugu navyamedia
సినిమా వార్తలు

శోభన్ బాబుకు స్టెప్పులు నేర్పించింది కమల్ హాసనే…!!

Sobhan-Babu

ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయి…“సోగ్గాడు”గా ఎంతోమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నట భూషణుడు శోభన్ బాబు. అమితంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథానాయకుడు శోభన్ బాబు గురించి చాలామందికి తెలియని విషయాలను నవ్యమీడియా వేదికగా పాఠకుల కోసం అందిస్తున్నాము. అయితే శోభన్ బాబుతో డ్యాన్స్ స్టెప్పులు ప్రాక్టీస్ చేయించింది తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ అన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు ? ఇప్పుడా విశేషాలు తెలుసుకుందాం.

Sobhan-Babu1

ఆరోజుల్లో అంటే 1970లో కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో “మాయని మమత” చిత్రంలో నటించే అవకాశం వచ్చింది శోభన్ బాబుకు. ఆ సినిమాలో శోభన్ బాబు చిన్న చిన్న స్టెప్పులు వేయాల్సి వచ్చింది. ఈ సినిమాకు డ్యాన్స్ మాస్టర్ తంగప్పగారు. అప్పట్లో కమల్ హాసన్ ఆయన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవారు. రోజూ శోభన్ బాబు చేత స్టెప్పులు ప్రాక్టీస్ చేయించేవారు కమల్ హాసన్. ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ అందానికి స్టెప్పులు తోడైతే అదరగొట్టేయొచ్చు అని అంటుండేవారు కమల్ హాసన్. అలా సాగుతూ సాగుతూ బ్రేక్ కోసం ఎదురు చూసిన శోభన్ బాబుకు రెండేళ్ల నిరీక్షణ ఫలితంగా “తాశీల్దార్ గారమ్మాయి” దక్కింది.

Tahsildar-Gari-Ammai

1971 నవంబర్ 12న విడుదలైన “తాశీల్దార్ గారమ్మాయి” సంచలన విజయం సాధించింది. ఏ నటినైతే శోభన్ బాబు తన కాలేజీ రోజుల్లో అత్యంత్య అభిమానంతో ఆరాధించారో, ఏ నటితో అయితే ఒక్క సినిమాలో అయినా జంటగా కలిసి నటించాలని కలలు కన్నారో ఆ నటి “జమున”తో నటించిన చిత్రం “తాశీల్దార్ గారమ్మాయి”. ఈ చిత్రంలో శోభన్ బాబు తండ్రి, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. జమునకు భర్తగానూ, కొడుకుగానూ నటించారు. ఈ చిత్రంతో సాంఘీక చిత్రాలకు శోభన్ బాబు పెట్టని కోట అనే నమ్మకం పరిశ్రమ అంతటా వ్యాపించింది.

Sobhan-babu-with-Sridevi

ఇక ఇదే సంవత్సరం అంటే 1971లోనే “నా తమ్ముడు” చిత్రం షూటింగ్ జరిగింది. ఆ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి బాలనటిగా నటించింది. ఈ చిత్రంలో శ్రీదేవికి బాబాయ్ గా నటించారు శోభన్ బాబు. అప్పటికే శ్రీదేవి చాలా చలాకీగా ఉండేవారు. శ్రీదేవితో శోభన్ బాబు “నువ్వు ఎప్పటికైనా హీరోయిన్ అయ్యి నా పక్కనే నటిస్తావు” అనేవారు. సరిగా 8 ఏళ్ళు తిరిగేసరికి… 1979లో వచ్చిన “కార్తీకదీపం” చిత్రంతో ఆయన మాటలు నిజమయ్యాయి.

ఇవి కూడా చదవండి

శోభన్ బాబును, ఆయన భార్యను కన్నీళ్లు పెట్టించిన అభిమానులు

శోభన్ బాబు సినిమాలు మానేశాక ఏం చేసేవారు ?

శోభన్ బాబు 40 సంవత్సరాల కాఫీ తాగే అలవాటును ఎందుకు మానుకున్నారంటే ?

శోభన్ బాబు సభలకు, సమావేశాలకు వెళ్లేవారు కాదు… ఎందుకంటే…?

శోభన్ బాబుతో జయలలిత మొదటి పరిచయం

జయలలితతో శోభన్ బాబు డిన్నర్…

అప్పట్లో రెండొందల కోసం శోభన్ బాబు ఎంత కష్టపడ్డారో తెలుసా ?

హీరోనవుతానన్న శోభన్ బాబు… ఆయన తాతగారు ఏమన్నారంటే…?

ఆంధ్రా అందగాడు, సోగ్గాడు “శోభన్ బాబు” రికార్డులు

సోగ్గాడు శోభన్ బాబు ఒక్కసారి కూడా గుడికి వెళ్ళలేదు… ఎందుకంటే…!?

శోభన్ బాబు పర్సనల్ ఛాంబర్ లోని సీక్రెట్స్ ఇవే

Related posts