telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“యాక్షన్” మా వ్యూ

Action

బ్యాన‌ర్‌ : శ‌్రీకార్తికేయ సినిమాస్‌
న‌టీన‌టులు : విశాల్, త‌మ‌న్నా, ఐశ్వ‌ర్య ల‌క్ష్మి, రామ్‌కీ, ఆకాంక్ష పూరి, క‌బీర్ దుహ‌న్ సింగ్, యోగిబాబు త‌దిత‌రులు
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం : సుంద‌ర్‌.సి
సంగీతం : హిప్‌హాప్ త‌మిళ‌
కెమెరా : డుడ్లీ
ఎడిటింగ్‌ : ఎన్‌.బి.శ్రీకాంత్‌
స్క్రీన్ ప్లే : వెంక‌ట్ రాఘ‌వ‌న్‌, సుభ, సుంద‌ర్‌.సి
నిర్మాత‌ : శ్రీనివాస్ ఆడెపు

యంగ్ హీరో విశాల్ తన సినిమాలను తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల చేసి మంచి విజయాలను అందుకుంటున్నారు. తాజాగా ఈ హీరో “యాక్షన్” అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి తన యాక్షన్ తో విషయాలు తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం.

క‌థ‌ :
తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇద్దరు కొడుకులు ఉంటారు. పెద్ద కొడుకు (రామ్ కీ) ఉపముఖ్యమంత్రిగా చేస్తాడు. చిన్న కొడుకు సుభాష్ (విశాల్‌) ఓ మిల‌ట‌రీ క‌మాండ‌ర్. సుభాష్ ఎప్పుడూ ఆర్మీ ఆపరేషన్స్ తో బిజీగా ఉంటాడు. పెద్ద కొడుకును ముఖ్యమంత్రిని చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని యోచిస్తారు ముఖ్యమంత్రి. అందులో భాగంగా ఓ నేషనల్ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడతారు. ఆ సమయంలోనే టెర్ర‌రిస్ట్ నాయ‌కుడు స‌య్య‌ద్ ఇబ్ర‌హీం మాలిక్‌ (క‌బీర్ దుహ‌న్ సింగ్‌) ఓ బాంబ్ బ్లాస్ చేసి అందులో సుభాష్ అన్న‌య్య‌ను ఇరికిస్తాడు. దీంతో సుభాష్ అన్న‌య్య ఉరి వేసుకుని చ‌నిపోతాడు. అసలు సుభాష్ అన్నయ్య ఎందుకు ఉరి వేసుకున్నాడు ? స‌య్య‌ద్ ఇబ్ర‌హీం మాలిక్‌ ఇలా చేయడానికి కారణమేంటి ? అతని వెనుక ఎవరున్నారు ? ఇలాంటి ప‌రిస్థితుల్లో సుభాష్ ఏం చేస్తాడు? అసలు నిజాన్ని సుభాష్ బయటకు తేవడానికి ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు ? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
విశాల్ యాక్ష‌న్ సీన్స్‌లో అదరగొట్టాడు. హై రిస్కీ ఫైట్స్‌ను విశాల్ అద్భుతంగా చేసి అభిమానులను మెప్పించాడు. త‌మ‌న్నాను ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ లోనే చూశాము. కానీ ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. క‌బీర్ దుహ‌న్ సింగ్ టెర్ర‌రిస్ట్ నాయ‌కుడి పాత్ర‌లో నటించి మెప్పించాడు. యోగిబాబు, మ‌రో క‌మెడియ‌న్ చేసిన రెండు మూడు కామెడీ స‌న్నివేశాలు చేసినా పెద్ద‌గా వర్కౌట్ అవ్వలేదు. డీసెంట్ పాత్రలో ఐశ్వ‌ర్య ల‌క్ష్మి ఆకట్టుకుంటుంది. ఆకాంక్ష పూరి కిల్ల‌ర్ లేడీగా, ఆకాంక్ష సింగ్ అల్ట్రా మోడ్రన్‌గా, హాట్‌గా ఓ పాట‌లో మెరిశారు, మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
సినిమా కథాపరంగా కొత్తగా లేనప్పటికీ దర్శకుడు పూర్తి స్థాయి “యాక్షన్”ను ప్రేక్షకులకు చూపించడానికి ప్రయత్నించాడు. సినిమాలోని అసలు పాయింట్ ను యాక్షన్ సన్నివేశాలకు కనెక్ట్ చేసిన తీరు బాగుంది. ఇంట‌ర్వెల్ ఫైట్ సీన్ సినిమాకే హైలైట్‌గా ఉంటుంది. డుడ్లీ కెమెరా పనితనం బావుంది. హిప్ హాప్ త‌మిళ సాంగ్స్‌ పెద్దగా ఆకట్టుకోవు కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆక్షన్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం ఒక ట్రీట్.

రేటింగ్ : 2.5 /5

Related posts