అమరావతి జేఏసీ అంటూ టీడీపీ నాయకులు…మరో పక్క పేదవారు దీక్షలు చేసారు.. కొంతమంది నాయకులు మాత్రం పేదవారిని మేక్ అప్ ఆర్టిస్టులు అంటున్నారని.. ఎంపీ నందిగాం సురేశ్ విమర్శించారు. ‘ అమరావతికి వెళ్లి చూద్దాం అక్కడ ఆర్టిస్టులు, మేకప్ ఆర్టిసులు ఎవరో తెలుస్తుంది. అసలు చంద్రబాబుకి అమరావతికి సంబంధం ఏమిటి? నేను నా సామాజికవర్గం తప్ప ఎవరూ ఉండటానికి వీల్లేదనే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఇళ్ల స్థలాల కోసం వచ్చిన వారిని ఎన్ని మాటలు అన్నారో అందరు చూశారు. ప్రజల తపున పోరాడాల్సిన వ్యక్తి అమరావతి ధనిక రైతుల తరపున మాట్లాడుతున్నాడు. లోకేష్ నిన్న ఇక్కడికి వచ్చి ఉంటే పేదలకు ఇళ్ళు స్థలాల కోసం వినతిపత్రం ఇద్దామనుకున్నాం.. కానీ ఆయన రాలేదు.
ఈరోజు కిష్టాయపాలెంలో తెలుగుదేశం గూండాలు పేదల పై ట్రాక్టర్ ఎక్కించేందుకు ప్రయత్నించారు.అమరావతిలో ఎనిమిదో వింత ఇక్కడే ఉన్నట్లుగా చంద్రబాబు ఫీల్ అవుతున్నాడు. దళితులు, బీసీలు, మైనారిటీలు తిరగబడితే ఎలా ఉంటుందో మీరు నిన్న చూసారు.దళితులను మోసం చేసినందుకు 5 ఏళ్ళు నిండింది. ఆయన నమ్మకానికి 5 సంవత్సరాలు అనడం హాస్యాస్పదం.33 వేల ఎకరాలు కాదు అన్ని భూములు కలిపితే 53 వేల ఎకరాలు చంద్రబాబు చేతిలో ఉన్నాయి.విచారణ వేయండి అన్నారు…వేస్తే కోర్టులకు వెళుతున్నారు.రఘురామకృష్ణ రాజు పగలు విగ్గు..రాత్రి పెగ్గుతో బిజీగా గడుపుతారని’ సురేష్ ఎద్దేవా చేశారు.
వైసీపీకి ధైర్యముంటే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి : కవిత