telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

చిగుళ్ళలో సమస్యా… వంటింటి చిట్కాలతో పరిష్కారం

Smile

చాలామందికి చిగుళ్లలో రక్తం కారుతుంది. అయితే దీన్ని సాధారణంగా పెద్ద సమస్యగా పరిగణించరు. చిగుళ్ళ సంరక్షణ గురించి చాలామందికి సరైన అవగాహన ఉండదు. సరైన ఓరల్ హైజీన్ లేకపొతే చిగురు దగ్గర ప్లేక్ ఏర్పడుతుంది. అది నెమ్మదిగా జింజివైటిస్ గా మారుతుంది. దానివల్ల చిగుళ్ళ వాపు, రక్తం కారడం వంటి సమస్యలొస్తాయి. ఈ జింజివైటిస్ ని వెంటనే ట్రీట్ చేయకపోతే ఇన్ ఫెక్షన్ పెరిగి పెరియోడాంటైటిస్ గా మారుతుంది. ఒక్కోసారి లుకేమియా, హీమోఫీలియా ఉన్నా కూడా చిగుళ్ళనించి రక్తం వస్తుంది. విటమిన్ సీ, విటమిన్ కే లోపాలున్నా, హార్మోనల్ తేడాలున్నా, కట్టుడుపళ్ళున్నా కూడా ఈ సమస్య వస్తుంది.

లక్షణాలు
– చిగురు వాపు
– రంగుమారిన చిగుళ్ళు
– ఎర్రబడిన చిగుళ్ళు
– పంటికీ చిగురికీ మధ్య దూరముండడం
– నోరు చెడువాసన రావడం
– నోట్లో రుచి తేడాగా అనిపించడం
– పళ్ళు కదలడం
– బ్రష్ చేస్తుంటే రక్తం కారడం
– పళ్ళు బాగా సున్నితంగా తయారవడం

ఈ సమస్యని తగ్గించడానికి కొన్ని చిట్కాలు.

1. ఉప్పు నీరు
ఇందులో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-సెప్టిక్ గుణాల వల్ల వాపు తగ్గుతుంది. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఉప్పు వేసి కలపండి. రోజుకి మూడుసార్లు ఈ నీటితో పుక్కిలించండి.

2. తేనె
తేనె చిగురు దగ్గర ప్లేక్ ఏర్పడకుండా చేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనెని చిగుళ్ళ మీద మృదువుగా మర్దనా చెయ్యండి. ఇలా రోజుకి రెండు సార్లు చెయ్యండి.

3. టీ బ్యాగ్స్
ఇందులో ఉండే టానిక్ ఆసిడ్ చిగురు వద్ద రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. టీ బ్యాగ్ ని వేడినీటితో తడపండి. దాన్ని మీ చిగుళ్ళ మీద పెట్టి నెమ్మదిగా కొరకండి. అలా ఐదు నిమిషాలుంచండి. ఇలా రోజుకి రెండు సార్లు చెయ్యండి.

4. పసుపు
పసుపులో ఉన్న కుర్క్యుమిన్ ప్లేక్ ఏర్పడకుండా చేసి వాపు లేకుండా చేస్తుంది. అర చెంచా ఆవనూనెలో అర చెంచా ఉప్పూ, చెంచా పసుపూ వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని చిగుళ్ళకి పట్టించి నెమ్మదిగా మర్దనా చెయ్యండి. ఇలా రోజుకి రెండు సార్లు చేయండి.

5. బేకింగ్ సోడా
బేకింగ్ సోడా వల్ల ప్లేక్ ఏర్పడతానికి కారణమయ్యే బాక్టీరియా నశిస్తుంది. ఒక మగ్గు వేడినీటిలో ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసి కలపండి. భోజనం తరవాతా, లేదా రోజుకి రెండుసార్లు ఈ మిశ్రమంతో నోరు పుక్కిలించండి.

6. అలోవెరా
ఇందులో ఉన్న యాంటీ-ఇంఫ్లమేటరీ, యాంటీ-సెప్టిక్ గుణాల వల్ల త్వరగా రిలీఫ్ లభిస్తుంది. ఒక టీ స్పూన్ అలోవెరా జెల్ ని చిగుళ్ళ మీద నెమ్మదిగా మర్దనా చెయ్యండి. అలా కొన్ని నిమిషాలుంచిన తరవాత నోరు శుభ్రంగా కడుక్కోండి. ఇలా రోజుకి రెండు సార్లు చేయండి.

7. లవంగ నూనె
ఇందులో ఉండే యూజనాల్ వల్ల నొప్పి తగ్గుతుంది. ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెలో రెండు, మూడు చుక్కలు లవంగనూనె వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని చిగుళ్ళకి రాసి పది నిమిషాలు వదిలేయండి. తరవాత నోరు బాగా కడుక్కోండి. ఇలా రోజుకి రెండు సార్లు చేయండి.

Related posts