telugu navyamedia
సినిమా వార్తలు

కాంట్రవర్సీల‌కు కెరాఫ్ అడ్రాస్ పూన‌మ్‌..

నిత్యం కాంట్రవర్సీ స్టేట్‌మెంట్‌లతో, ట్వీట్‌లతో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉంటుంది అందాల భామ పూనమ్‌ కౌర్‌. టాలీవుడ్ లో ‘శౌర్యం’, ‘గణేష్‌’, ‘గగనం’, ‘శ్రీనివాస కల్యాణం’ సహా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందారు. పలు తెలుగు తమిళ చిత్రాల్లో నటించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.

  పూనమ్ కౌర్  సోషల్ మీడియాలోషేర్ చేసిన ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

అయితే నిత్యం సోషల్ మీడియాలో పూనమ్ రకరకాల పోస్ట్లు పెడుతూ ఫాలోవర్స్‌తో, ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటారు. అలాగే ప్రకాశ్ రాజ్‌ను ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో గెలిపిస్తే తాను ఎంతో కాలంగా నిశబ్దంగా ఎదుర్కొంటున్న సమస్యలను బయట పెడతానంటూ.. రచ్చ చేసింది.

అనంతరం తనకు తండ్రి సమానులు దాసరి నారాయణరావు గురించి ఓ ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏకైక గురువు దాసరిగారు. ఆయనను చాలా మిస్సవుతున్నాను. దాసరిగారికి నేనొక సందేశాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాను. దేవుడు దానిని ఆయనకు చేరవేస్తాడని ఆశిస్తున్నాను..’’ అంటూ ఆమె ట్వీట్ చేయడం చర్చకు దారి తీసింది. 

Poonam Kaur slams media about fake news reports

అయితే.. తాజాగా ట్విట్టర్​లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన పూనమ్ కౌర్ .. ‘పీకే లవ్’​ అని హ్యాష్ ​ట్యాగ్ జోడించారు.  దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సినీ నటుడు పవన్​ కల్యాణ్​ పేరు ‘పీకే’ కావడం, పూనమ్​ కౌర్​ షార్ట్​ నేమ్​ కూడా పీకే కావడం వల్ల ఈ పోస్ట్​పై విభిన్న స్పందన వస్తోంది. నెటిజన్లను కన్ఫ్యూజ్​ చేయడంలో పూనమ్​ సఫలమయ్యారనే చెప్పాలి.

Related posts