telugu navyamedia
సినిమా వార్తలు

“గల్లీ బాయ్” తెలుగు రీమేక్ లో మెగా హీరో ?

Sai-Dharam-Tej

ఇటీవల హిందీలో భారీ హిట్ సాధించిన సినిమాల్లో “గల్లీబాయ్” కూడా ఉంది. రణ్ వీర్ సింగ్, అలియా భట్ జంటగా జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబట్టి రికార్డులు సృష్టించింది. ఈ సినిమాను సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెలుగులో రీమేక్ చేయనున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన సన్నిహితులు ఈ విషయాన్ని ఖండించి ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. మరోవైపు ఈ రీమేక్ లో సాయిధరమ్ తేజ్ చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది.
సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోన్న తేజుకు “చిత్రలహరి” ఊరటనిచ్చింది. ఇప్పుడు తేజ్ బాలీవుడ్ లో హిట్ కొట్టిన “గల్లీబాయ్” చేయాలనే నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన తేజ్ “అసలు ఇంతవరకూ నేను ‘గల్లీబాయ్’ సినిమానే చూడలేదు. అలాంటిది ఈ సినిమా రీమేక్ లో ఎలా చేస్తాను? .. ఇదంతా కేవలం పుకారు మాత్రమే” అని స్పష్టం చేశారు. అంటే తేజ్ కూడా ఈ సినిమా రీమేక్ లో చేయడం లేదనే స్పష్టత వచ్చేసింది.

Related posts