telugu navyamedia
సినిమా వార్తలు

‘ఆచార్య’ నుంచి అదిరిపోయే అప్డేట్​..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తున్న సినిమా “ఆచార్య”. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా లో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌పోషిస్తున్నారు. రామ్‌ చరణ్‌ సరసన పూజా హెగ్డే్‌ నటిస్తోంది.

సురేఖ్‌ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతకాలపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల కోసం ఇటు మెగా అభిమానులే కాకుండా యావత్‌ సినీ ఇండస్ట్రీ సైతం ఎదురు చూస్తోంది.

Image

ఇక ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.

ఈ సినిమాలో కీలక పాత్ర పోషించినటువంటి రామ్ చరణ్ రోల్ పై మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ముందు ఆచార్య టీజర్ చూసారు ఇక ఇప్పుడు సిద్ధ టీజర్ తో చరణ్ ని విట్నెస్ చెయ్యమని అదిరే పోస్టర్ తో ఈ కొత్త అప్డేట్ ని దింపారు.

మరి ఈ టీజర్ ని వచ్చే నవంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 4న రిలీజ్ కానుంది.

Related posts