telugu navyamedia
తెలంగాణ వార్తలు

బీజేపీ వారు గూండాలు, పోకిరీలు – కేటీఆర్ ట్వీట్‌

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్యాలయం (జిహెచ్‌ఎంసి) వద్ద నిరసనకు దిగిన బిజెపి కార్పొరేటర్ల చర్యను మంత్రి కెటి రామారావు ఖండించారు.  బీజేపీ కార్పొరేటర్ల తీరు దారుణమని, వారిని ‘గూండాలు, పోకిరీలు’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

Image

గాడ్సే అభిమానులను గాంధీ మార్గంలో నడవమని కోరటం అత్యాశే అవుతుందని ఎద్దేవా చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా…. దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తీసుకోవాలని హైదరాబాద్‌ సీపీని కేటీఆర్‌ కోరారు. ఈ దాడి ఘటనను ఖండిస్తూ ట్వీట్ చేశారు.

Image

హైదరాబాద్‌ జీహెచ్​ఎంసీ కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు మంగళవారం సాధారణ సభ నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్పొరేషన్‌ను కోరుతూ నిరసన చేపట్టారు . జనరల్ బాడీ మీటింగ్ పెట్టాలని మేయర్‌ ఛాంబర్‌లోకివెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Image

Related posts