రాజకీయనేతలు అప్పుడప్పుడు నోరు జారడం, అది ఎవరో ఒకరు ఏదో ఒక మాధ్యమం ద్వారా బయటపెట్టడం సహజం. తాజాగా, తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ కూడా తానే సీఎం అంటూ నోటి దూల చూపించారు.. అది కాస్తా వైరల్ అయిపోయింది. అసలే రాజగోపాల్ బీజేపీలో చేరడం ఖాయమన్న ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో విషయం తెలుసుకునేందుకు ఆయనకు సన్నిహితంగా మెలిగే ఓ కార్యకర్త ఫోన్ చేశారు. రాజగోపాల్ ఆయనతో మాట్లాడుతూ.. తాను కనుక బీజేపీలో చేరితే తెలంగాణకు భవిష్యత్ ముఖ్యమంత్రిని తానే అవుతానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని ఈ విషయం పార్టీ చీఫ్ రాహుల్ గాంధీకి కూడా తెలుసని వ్యాఖ్యానించారు. ఇప్పుడీ ఆడియో టేప్ తెలంగాణ రాజకీయాల్లో సంచలనమైంది. గత కొంతకాలంగా బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్న రాజగోపాల్ ఆ పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నెల 28న ఆయన ఢిల్లీ వెళ్లనుండడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. అదే రోజు ఆయన కాషాయ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది.
సిద్ధార్థ్ నన్ను వాడుకున్నాడు… కానీ… హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు