telugu navyamedia
తెలంగాణ వార్తలు

రైతులకు, పేద ప్రజలకు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా బడ్జెట్‌: హరీశ్‌రావు

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలుకు అనుగుణంగా బడ్జెట్‌ ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఆయన నివాసం నుంచి బయల్దేరిన హరీశ్‌రావు…. బంజారాహిల్స్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. 

అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంమత్రి కేసీఆర్ ఆశీస్సులతో తాను మూడవ సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతునట్లు హరీశ్ రావు తెలిపారు. 2022-23 వార్షిక బడ్జెట్‌లో కేసీఆర్​ మార్కు కనిపిస్తుందన్నారు. రైతులకు, పేద ప్రజలకు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉంటుందన్నారు.

బడ్జెట్‌లో రైతులు, సామాన్యులకు పెద్దపీట వేస్తున్నాం. ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించేలా బడ్జెట్‌ ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా బడ్జెట్ రూపకల్పన చేశామ‌ని తెలిపారు. మానవీయ కోణంలో బడ్జెట్ ను రూపొందించామని, బడ్జెట్ సర్వజనామోదం పొందుతుందని హరీశ్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts