*రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు…
*గవర్నర్ ప్రసంగ పత్రాలను చించేసిన టీడీపీ సభ్యులు
*గవర్నర్‌కు వ్యతిరేకంగా పెద్ద యెత్తున నినాదాలు..
*ప్రతిపక్షతీరుపై సీఎం జగన్ తీవ్ర అసంతృప్తి..
*స్పీకర్ పోడియం దగ్గరకు టీడీపీ సభ్యులు నినాదాలు..
*టీడీపీ సభ్యులతో మారుమోగుతున్న ఏపీ అసెంబ్లీ..
ఆంధ్రప్రదేశ్‌లో శాసన మండలితోపాటు, శసనసభ 2022-23 బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తున్నారు. సమావేశాల్లో భాగంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే టీడీపీ నాయకులు నిరసనకు దిగారు.
గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థల్ని కాపడలేని గవర్నర్ గోబ్యాక్ గో బ్యాక్ అంటూ అంటూ నినాదాలు చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగ పత్రాలను చించేసి పొడియంపైకి విసిరారు టీడీపీ నేతలు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో టీడీపీ నేతలు నినాదాలు చేస్తూనే ఉన్నారు. టీడీపీ నాయకుల నిరసనల నడుమే గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ప్రసంగం కొనసాగుతోంది. దీంతో సభలో గందరగోళం నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం జగన్ అసహనం వ్యక్తం చేశారు.
చంద్రబాబు చచ్చిన విషసర్పం..