ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తున్నారు.గవర్నర్ ప్రసంగం ప్రారంభం నుంచి సభలో టీడీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు.
గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ టీడీపీ సభ్యులు సభలో పెద్ద యెత్తుననినాదాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను టీడీపీ సభ్యులు చించివేశారు.
దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే సభ నుంచి బయటకు టీడీపీ సభ్యులు వెళ్లిపోయారు.
కాగా… గవర్నర్ తిరిగి వెళ్లే దారిలో టీడీపీ సభ్యులను వెళ్లనీయకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. శాసనమండలికి కూడా వెళ్లకుండా అడ్డుకుంటారా అంటూ లోకేష్ మండిపడ్డారు. సభలో మాట్లాడనివ్వడం లేదు.. కనీసం లాబీల్లో కూడా ఉండనివ్వరా అంటూ కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగులుతున్న ఎమ్మెల్సీలు బీటెక్ రవితో పాటు మరో ఎమ్మెల్సీని బయటకు మార్షల్స్ బయటకు పంపారు. ఈ క్రమంలో మార్షల్స్‌తో టీడీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వాగ్వివాదానికి దిగారు.
టీడీపీ నేతలు ఆ నిధులను కూడా మింగేశారు: విజయసాయిరెడ్డి