telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోంది..-గవర్నర్‌

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలిరోజు వాడివేడిగా మొదలయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు.

వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని గవర్నర్‌ విశ్వభూషన్‌ అన్నారు. రైతులు, మహిళలు, బడుగు, బలహీనవర్గాలకు ఏపీ ప్రభుత్వం చేయూతనిచ్చింది. ఉద్యోగుల పరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచాము. 2020-21 ఏడాదికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16.82 శాతం సమగ్ర వృద్ధి సాధిస్తుంది.

ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన కొనసాగుతుందని అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ మెరుగైన అభివృద్ధి సాధింస్తోందని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు పారదర్శకంగా పనిచేస్తున్నాయి

కోవిడ్‌ వల్ల రెండేళ్ల నుంచి దేశం, రాష్ట్రం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయని, గత మూడేళ్లుగా వికేంద్రీకృత, సమ్మిళిత పాలన ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులను మూలస్తంభాలుగా భావిస్తున్నామని తెలిపారు.

జగనన్న వసతి దీవెన కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ.2,304 కోట్లు జమ చేశామని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు ప్రతిపాదించామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు.

ఉద్యోగుల వయో పరిమితిని 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తెలిపారు. 2020-2021 ఏడాదికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 16.82 శాతం సమగ్ర వృద్ధి సాధించిందని అన్నారు. మన బడి నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జరుగుతోందని, తొలి దశలో రూ.3,669 కోట్లు ఖర్చు చేసి 17,715 పాఠశాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. 44.5 లక్షల మంది తల్లులకు అమ్మఒడి కింద రూ. 13,023 కోట్లు అందజేశామని చెప్పారు. 

‘2021-22లో రూ. 9,091 కోట్ల వ్యయంతో రైతులకు ప్రయోనం చేకూర్చాం. జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారులకు రూ. 1,416 కోట్ల సాయం అందించామనిచెప్పారు. 

వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర కింద ఆటో, ట్యాక్సీ, డ్రైవర్లకు రూ. 770 కోట్లు సాయం. జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయి బ్రాహ్మణులకు రూ. 583 కోట్ల సాయం అందించాం. జగనన్న వసది దీవెన కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు రూ. 2,304 కోట్లు జమ చేశాము. శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశామ’ని వివరించారు.

 

Related posts