telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇకపై సీఆర్డీఏ స్థానంలో ఏఎంఆర్డీఏ: ఏపీ సర్కారు

ap

ఇటీవలే సీఆర్డీయే రద్దు బిల్లుకు ఏపీ గవర్నర్ ఆమోదం తెలపడంతో సీఆర్డీఏ చరిత్ర ముగిసినట్టు తెలుస్తోంది. సీఆర్డీయే రద్దు చట్టానికి సంబంధించి ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసింది. ఇప్పుడు సీఆర్డీయే స్థానంలో కొత్తగా ఏఎంఆర్డీయే వచ్చింది. ఏఎంఆర్డీఏ అంటే అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ. తాజాగా ఏఎంఆర్డీఏను నోటిఫై చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇకపై సీఆర్డీఏ పరిధి అంతా ఏఎంఆర్డీఏ పరిధిలోకి వస్తుందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఆర్డీఏ రద్దు చట్టం-2020 అమల్లోకి వచ్చిందని, దాంతో 2014 నాటి సీఆర్డీఏ చెల్లదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక, నూతనంగా వచ్చిన ఏఎంఆర్డీఏకి పాలకమండలిని కూడా నియమించారు.

Related posts