భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈ మహమ్మారి బారినపడ్డారు. ఆయనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
కరోనాకు సంబంధించిన ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో, కరోనా పరీక్ష చేయించుకున్నానని, దాంట్లో పాజిటివ్ వచ్చిందని తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, అయితే, డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో చేరానని పేర్కొన్నారు. గత కొన్నిరోజులుగా తనను కలిసినవాళ్లందరూ దయచేసి ఐసోలేషన్ లో ఉండాలని షా సూచించారు.