telugu navyamedia
రాజకీయ వార్తలు

కేంద్రంపై కశ్మీరీల్లో వ్యతిరేకత.. కర్ఫ్యూ ఎత్తేస్తే తెలుస్తుంది: గులాం నబీ అజాద్

Congress Gulamnabhi ajad fire Bjp

ఆర్టికల్ 370ని రద్దు చేయడం పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం పై కశ్మీర్ లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అన్నారు. జమ్ముకశ్మీర్ లో ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతోందని, ఈ సమయంలో అక్కడి పరిస్థితులను అంచనా వేయలేమని చెప్పారు.

ఒక్కసారి కర్ఫ్యూ ఎత్తేస్తే…. ప్రజలు ఆగ్రహంతో రోడ్డెక్కుతారా? లేక సంతోషం వ్యక్తం చేస్తారా? అనే విషయం తెలుస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పగలనని వ్యాఖ్యానించారు. ఇప్పటికే కార్గిల్ ప్రాంతంలో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు.

Related posts