telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

సినీ సినీ పాత్రికేయులకు పవన్ కృతజ్ఞతలు

pawan

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సినీ సినీ పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబరు 2న పుట్టినరోజు జరుపుకున్న టాలీవుడ్ అగ్రహీరో పవన్.. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ వినమ్రంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

తన బర్త్ డే వార్తల కవరేజి ఇస్తూ, కొన్నిరోజులుగా తన గురించి, తన చిత్ర విశేషాల గురించి విస్తృతంగా రాస్తున్న సినీ పాత్రికేయులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సినీ డెస్క్ ఇన్చార్జులు, విలేకరులు, ఫొటోగ్రాఫర్లు, కెమెరామన్లు, వెబ్ మీడియా నిర్వాహకులు, జర్నలిస్టులు ప్రత్యేక కథనాల ద్వారా గ్రీటింగ్స్ తెలిపారని పవన్ పేర్కొన్నారు.

Related posts