ఐపీఎల్ 2021 కోసం చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మార్చి 31 నుండి ట్రైనింగ్ సెషన్‌ను ప్రారంభించనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా త్వరలోనే తమ ట్రైనింగ్ క్యాంప్‌ను ప్రారంభింస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆటగాళ్లు, సిబ్బంది ఏడు రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని కోల్‌కతా జట్టు యాజమాన్యం ప్రకటించింది. అందుకు ఏర్పాట్లు కూడా చేసింది. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తమ అభిమానుల కోసం స్పెషల్ ఐపీఎల్ ‘క్వారంటైన్’ సాంగ్‌ను విడుదల చేసింది. కరోనా కారణంగా గతేడాది మ్యాచ్‌లు ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించగా.. ఈ సీజన్‌లోనూ అదే పరిస్థితి నెలకొననుంది. వరుసగా రెండో సీజన్‌లోనూ ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించడాన్ని అభిమానులు కోల్పోతున్నందున ఫ్యాన్స్‌కు అంకితం చేస్తూ ఈ పాటను రూపొందించారు. ‘వీ విల్ మిస్ యూ’ అంటూ సాగే ఈ పాటను కేకేఆర్ తమ ట్విటర్ ఖాతా ద్వారా రిలీజ్ చేసింది. అయితే కోల్‌కతా ఏప్రిల్ 11న తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
previous post
next post
ప్రజలు తిరస్కరించినా.. చంద్రబాబుకు బుద్ధి రాలేదు: రోజా