telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలు… ఏపీ ప్రభుత్వంలో కీలక పరిణామాలు.

విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాల విషయంలో ఏపీ ప్రభుత్వంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బాక్సైట్ సరఫరా విషయంలో అన్‌ రాక్‌తో ఉన్న వివాదానికి పరిష్కారం కనుగొనే పనిలో ఏపీ సర్కార్ ఉంది. విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలు జరపకుండా వివాదాన్ని పరిష్కరించేందుకు కసరత్తు చేస్తుంది. మన్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బాక్సైట్ తవ్వకాలు జరిపేదే లేదని ప్రభుత్వం స్పష్టీకరణ చేసింది. అన్‌ రాక్ వివాద పరిష్కారానికి వివిధ ప్రత్యామ్నాయాలపై అధికారుల సమాలోచనలు చేస్తున్నారు. అన్ రాక్ సంస్థకు వేరే రాష్ట్రంలోని బాక్సైట్ గనులను అప్పజెప్పడం కుదురుతుందా అని కేంద్రాన్ని కోరనుంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే కేంద్ర గనుల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు ఏపీ అధికారులు. అన్‌ రాక్ సంస్థలోని రకియా వాటాలను ప్రభుత్వమే కొనుగోలు చేసే అంశం పైనా అధికారిక వర్గాల్లో చర్చ నడుస్తుంది. రకియా వాటాను కొనుగోలు చేయాలంటే ఎంత మొత్తం నిధులు అవసరమవుతాయనే లెక్కలేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం అన్‌ రాక్‌ రిఫైనరీ ప్రాజెక్టు పనికి రాకుండా ఉండడంతో వాటాల కొనుగోలుతో నష్టమేనని భావిస్తున్నారు అధికారులు. మరి కొన్ని రోజుల్లో అన్ రాక్ వివాదానికి ఫుల్ స్టాప్‌ పెట్టేలా పరిష్కారం కనుగొంటామంటుంది ప్రభుత్వం.

Related posts