telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణలో రజాకార్ల పాలన మళ్లీ వచ్చినట్టుంది – బండి సంజయ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

*బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు
*టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు లైసెన్స్ ఉన్న‌ గూండాల్లా మారిపోయారు
*తెలంగాణలో రజాకార్ల పాలన మళ్లీ వచ్చినట్టుంది..
*వెంక‌ట‌రెడ్డి మాతో ట‌చ్‌లో ఉన్నార‌న‌లేదు..
*బీజేపీ ఈడీ ని వాడుకోవాలనుకుంటే ..
తెలంగాణలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగ‌ల‌రు
అంతా జైలుకుపోయే వారు

రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లైసెన్స్ డ్ గూండాల్లా మారిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మోత్కూర్ లోని ప్రజా సంగ్రామ యాత్ర శిబిరం వద్ద ఈ రోజు ఉదయం స్థానిక మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ.. మంత్రులు తుపాకీలో కాల్పులు జరుపుతంటే తెలంగాణలో రజాకార్ల పాలన మళ్లీ వచ్చినట్టుగా కన్పిస్తుందని విమర్శించారు.

మునుగోడు ఉప ఎన్నిక నుండి కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎప్పుడో పారిపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ బొమ్మతో తిరిగితే ఓట్లు పడే రోజులు ఎప్పుడో పోయాయన్నారు. టీఆర్‌ఎస్‌కు అనుసంధానంగా ఉన్న అధికారుల లిస్ట్‌ తీస్తున్నామని.. అధికారంలోకి వచ్చాక వాళ్ల సంగతి చూస్తామన్నారు.

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను విమర్శించలేదన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాతో టచ్‌లో ఉన్నాడని నేను ఎప్పుడు అనలేదని.. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంచి లీడర్ అని ఆయన కితాబిచ్చారు.

బీజేపీ ఈడీ ని వాడుకోవాలనుకుంటే రాష్ట్రంలో తెలంగాణలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే కూడా మిగలరని.. అంతా జైలుకుపోయే వారని వ్యాఖ్యానించారు. ఈడీ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.

కమ్యూనిష్టులు ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ క్యాడర్ బీజేపీకి సపోర్ట్ చేసిందని గుర్తు చేశారు బండి సంజయ్​.

రాష్ట్ర ప్రభుత్వం సర్కారీ బడుల్లో చాక్ పీసులకు కూడా పైసలిచ్చే పరిస్థితి లేదని, పంద్రాగస్టు వేడుకల్లో పిల్లలకు చాక్లెట్లు పంచడానికి కూడా డబ్బులివ్వట్లేదని అన్నారు.

Related posts