telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పరిసరాలను శుభ్రపరుచుకోవాలి: కేటీఆర్‌

ktr pragathi bhavan

సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా కలిసి రావాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. “ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు” పరిశుభ్రత కార్యక్రమంలో కేటీఆర్ స్వయంగా పాల్గొన్నారు. ప్రగతి భవన్ లో ఉన్న పూల కుండీలతో పాటు పాత్రల్లో నిండిన నీటిని మంత్రి శుభ్రపరిచారు.

సీజనల్‌ వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 10 నిమిషాల పాటు ప్రజలు తమ ఇండ్లను, పరిసరాలను శుభ్రపరుచుకోవాలని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. కాగా, కేటీఆర్ పిలుపు మేరకు మంత్రులు, ఇతరు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించి, ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

Related posts