డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మరోసారి ఐపీఎల్ విజేత అయింది. వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ ను ముద్దాడింది. ఆల్ రౌండ్ షో తో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఫైనల్లో ఘన విజయం సాధించింది. 157 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ కు దిగిన ముంబై అవలీలగా విజయం సాధించింది. ముంబై లో ఓపెనర్ రోహిత్ శర్మ 68 పరుగులతో మంచి ఆరంభం ఇవ్వడంతో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే విజయ కేతనం ఎగురవేసింది. ఇక అటు మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ అనుకున్నంతగా రాణించలేదు. నిర్ణిత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ విఫలమవడంతో ఢిల్లీ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఓపెనర్లు మార్కస్ స్టోయినిస్ (0), శిఖర్ ధవన్ (15) పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యారు. ఇక తర్వాత వచ్చిన రహానే కూడా ఎప్పటిలాగే (2) పరుగులు చేసి వెనుదిరిగాడు. టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో జట్టు భారమంతా మిడిల్ ఆర్డర్ పైనే పడింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ టాప్ ఆర్డర్ రాణించకపోవడం ఆ జట్టుకు గట్టి దెబ్బ అని చెప్పచ్చు. అటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ శ్రేయష్ అయ్యర్ (65), కీపర్ రిషబ్ పంత్ (56) పరుగులు చేసి..జట్టుకు గౌరవపద స్కోర్‌ను అందించారు. కానీ విజయం ముంబై ని వరించింది.
previous post
జగన్ ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని హిందూ ధర్మాన్ని కాపాడాలి: స్వామి శ్రీనివాసానంద