ప్రేమ అనేది ఒక మధురమైన అనుభూతి. ప్రేమకు వయస్సుతో పని లేదు. ఏ ఏజ్‌లోనైనా ప్రేమ పరిమళిస్తోంది. ప్రేమికుల్లో ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు ఉండచ్చు…. లేదా పురుషులు ఉండొచ్చు. మొత్తానికి ప్రేమకు వయస్సుతో పనిలేదన్నమాట. ఇది ఇలా ఉండగా.. మహబూబాబాద్ జిల్లాలోని ఓ తండాకు చెందిన గణేష్ డిగ్రీ చేస్తున్నాడు. అతని పక్కింట్లో ఉండే ఓ బాలిక ఏడో తరగతి చదువుకుంటోంది. అయితే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ ఆ ఇద్దరి ఇంట్లో వీరి ప్రేమను తిరస్కరించారు. దీంతో ఆ ఇద్దరు ప్రేమికులు ఎస్కేప్ అయ్యారు. ఈ విషయం తెలిసిన బాలిలక కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆగ్రహించారు. తమ కూతురిని ఎత్తుకెళ్లిన గణేష్ ఇంటిపై దాడి చేశారు. అడ్డొచ్చిన గణేష్ మేనమామను కత్తితో పొడిచారు. ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు. బీరువాలోంచి రెండు లక్షల రూపాయల డబ్బును… ఐదు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు. అంతటితో ఆగకుండా గణేష్ కుటుంబానికి చెందిన పొలానికి వెళ్లి, అక్కడ వ్యవసాయ బోర్లను కూడా కాల్చేశారు. వాటి విలువ ఏకంగా రూ.6 లక్షలు ఉంటుందని బాధితులు వాపోయారు. ఆ జంట జంప్ కారణంగా గణేష్ కుటుంబానికి దాదాపు పది లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది. అయినప్పటికీ గణేష్ ఫ్యామిలీ… బాలిక ఫ్యామిలీపై ఎలాంటి కేసులు పెట్టకపోవడం కొసమెరుపు.
previous post
అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలి: కన్నా