telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైతులను సంఘటిత పరచడమే లక్ష్యం: జగదీశ్‌ రెడ్డి

jagadish reddy

నియంత్రిత వ్యవసాయంలో రైతులను సంఘటిత పరచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ల వ్యవసాయ సంసిద్ధతపై సమీక్ష మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర రైతులు దేశానికే ఆదర్శంగా నిలవబోతున్నరని అన్నారు. రైతాంగాన్ని సంఘటితం చేసి లాభాలు పొందే విధంగా సీఎం కేసీఆర్‌ నియంత్రిత వ్యవసాయ విధానాన్ని తీసుకువచ్చారన్నారు.

రైతుల ఉత్పత్తులకు విలువ పెరిగేలా ప్రభుత్వం నియంత్రిత విధానం తెచ్చిందన్నారు. రైతు పండించిన కంది పంటలో ప్రతి గింజ ప్రభుత్వం కొంటుందన్నారు.రైతులకు 24 గంటల కరెంట్‌ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. కానీ మార్కెట్‌లో రైతులు పండించిన పంటలకు ధర నిర్ణయించుకునే పరిస్థితి లేదన్నారు. కాబట్టే రైతులు నష్టపోతున్నారు. అందుకే సీఎం కేసీఆర్‌ రైతులను ఐక్యం చేయడానికి నియంత్రిత విధానాన్ని ముందుకు తెచ్చారన్నారు.

Related posts