telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ నటుడు కిర‌ణ్ కుమార్ కు కరోనా నెగెటివ్

Kiran-Kumar

బాలీవుడ్‌లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తుంది. మే 14న బాలీవుడ్ న‌టుడు కిర‌ణ్ కుమార్ (74) క‌రోనా బారిన ప‌డ్డారు. మెడిక‌ల్ చెక‌ప్‌లో భాగంగా ఆయ‌న ఆసుప‌త్రికి వెళ్ల‌గా, క‌రోనా ఉన్న విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ద‌గ్గు, జలుబు, జ్వ‌రం వంటి ల‌క్ష‌ణాలు కిర‌ణ్ కుమార్‌కి లేక‌పోవ‌డంతో వైద్యులు షాక్ అయ్యారు. కరోనా పాజిటివ్ రావ‌డంతో కిర‌ణ్ వెంట‌నే స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. దీంతో మూడోసారి జ‌రిపిన టెస్ట్‌లో నెగెటివ్ అని తేలింది. ఈ స‌మ‌యంలో త‌నని కంటికి రెప్ప‌లా చూసుకున్న ముంబై హిందూజా హెల్త్ కేర్ హాస్పిట‌ల్‌, లీలావ‌తి హాస్పిట‌ల్‌కి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు కిర‌ణ్‌. భ‌యాందోళ‌న‌ల‌కి గురి కాకుండా మాకు ధైర్యాన్ని అందించిన న‌ర్సుల‌కి బిగ్గర‌గా కృత‌జ్ఞ‌త‌లు చెప్పాల‌నుకుంటున్నాన‌ని కిర‌ణ్ స్ప‌ష్టం చేశారు.

Related posts