ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీపై జగన్ కక్ష ఎలా ఉంటుందనేందుకు నిదర్శనం మండలి రద్దు నిర్ణయమే అని విమర్శించారు. మండలిలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులు పాస్ కాలేదన్న అక్కసుతోనే కౌన్సిల్ ను రద్దు చేస్తున్నారని విమర్శించారు.
మండలి రద్దయ్యేలోపు మిగతా కార్యాచరణ ఆగదు అని అన్నారు. రాజధాని రైతులపై పోలీసులు దాడులపై ఆయన మండిపడ్డారు. ప్రజల బాధలు, సమస్యలు తెలుసుకుని పరిపాలించాలి గానీ ఓ నియంతలా పరిపాలన సాగిస్తే కుదరదని జగన్ ని హెచ్చరించారు. జగన్ పాలనలో పోలీస్ వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు.