telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఎన్నిక ఏకగ్రీవం..

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్​పై నెలకొన్న ఉత్కంఠ వీడింది. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఏక గ్రీవం అయింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ గా తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె… కల్వకుంట్ల కవిత ఏక గ్రీవం గా ఎన్నిక అయ్యారు. క‌విత ఏక‌గ్రీవంపై అధికారికంగా ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది.

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఏక గ్రీవం అఫిడవిట్​లో తప్పుల కారణంగా స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ నామినేషన్​ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. స్వతంత్ర అభ్యర్థి సైతం పోటీలో లేకుండా పోవటం వల్ల… స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో తెరాస నుంచి నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవిత ఎన్నిక ఏకగ్రీవం కానున్నారు.

ఈ స్థానానికి రెండే నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో శ్రీనివాస్ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో కవిత ఎన్నిక ఏకగ్రీవమైంది. దీనిపై అధికారులు ప్రకటించానున్నారు. 

స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నవంబర్​ 16న నోటిఫికేషన్ విడుదలైంది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 16 నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్లు స్వీకరించగా.. నేడు ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తైంది. నామినేషన్ల ఉపసంహరణకు 26 వరకు గడువుంది. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించగా… డిసెంబరు 14న ఓట్లను లెక్కిస్తారు. 

Related posts