ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు, స్టార్ హీరో అల్లు అర్జున్, అల్లు శిరీష్ ల సోదరుడు అల్లు బాబీ తాజాగా రెండవ పెళ్ళితో పెళ్ళి పీటలెక్కారు. నీలు షా అనే యోగా ట్రైనర్‌ని బాబీ వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుక హైదరాబాద్లోని ఐటిసి కోహినూర్ హోటల్లో చాలా నిరాడంబరంగా జరిగింది. ఈ వేడుకకు అల్లు ఫ్యామిలీతో పాటు చిరు ఫ్యామిలీకి సంబంధించిన కొందరు మాత్రమే హాజరైనట్టు సమాచారం.ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన నీల స్వస్థలం ముంబై. సోదరితో కలిసి ఆమె యోగా డెస్టినేషన్ పేరుతో హైదరాబాద్ నగరంలో యోగా స్టూడియో నిర్వహిస్తోంది. నీల తండ్రి కమల్ కాంత్ ఒక వ్యాపారవేత్త. వీరివురూ గత సంవత్సర కాలంగా డేటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వీరి పెళ్ళి పట్ల రెండు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. బాబీకి కొన్నేళ్ళ క్రితమే పెళ్లి కాగా కొన్ని కారణాల వలన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. వీరికి అన్విత అనే కుమార్తె కూడా ఉంది. ఇక బాబీ అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కు సంబంధించిన పనులు చూసుకుంటూ ఉంటారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరి పెళ్ళి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
previous post