telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అడ్డమైనవారు వచ్చి అమ్మ అంటే నేను పట్టించుకోవాలా ?… గాయని అనురాధా పౌడ్వాల్

ANuradha

ప్రముఖ గాయని అనురాధా పౌడ్వాల్ ఎట్టకేలకు తనపై వస్తున్న ఆరోపణలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. కేరళకు చెందిన కర్మలా మోడెక్స్ అనే మహిళ.. అనురాధ తన కన్న తల్లి అని, పుట్టిన నాలుగు రోజులకే తనను వదిలించుకుందని షాకింగ్ ఆరోపణలు చేసింది. దీనిపై అనురాధ మీడియా ద్వారా స్పందిస్తూ.. ‘‘ఇలాంటి పనికిమాలిన మాటలను నేను పట్టించుకోను. అడ్డమైనవారు వచ్చి అమ్మ అంటే నేను పట్టించుకోవాలా. నేను స్పందిస్తే నా స్టేటస్ దిగజారిపోతుంది. ఏదేమైనా నా గురించి ఆలోచించినందుకు ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు’ అని తెలిపారు. అనురాధ మేనేజర్ కూడా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ‘కర్మల ఓ సైకో. అనురాధకు 1974లో కూతురు పుట్టింది. ఆమె పేరు కవిత. కాబట్టి కర్మల చేసే ఆరోపణలన్నీ తప్పు. కోర్టుకు అనురాధతో పాటు ఆమె భర్త కూడా రావాలని అంటోంది. అనురాధ భర్త ఎప్పుడో చనిపోయారు. కన్న కూతురైతే ఈ విషయం తెలుసుకుని ఉండాలి కదా. ఒకవేళ ఆమె నిజంగా అనురాధ కన్న కూతురు అయివుంటే ఆమే డబ్బు ఇవ్వాలి కానీ ఇలా 50 కోట్లు నష్టపరిహారం అడగకూడదు’ అని మండిపడ్డారు.

Related posts