telugu navyamedia
సినిమా వార్తలు

“సరిలేరు నీకెవ్వరూ”కు పోకిరి సెంటిమెంట్ ?

Mahesh

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు “మహర్షి”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఆయన 26వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ చిత్రానికి “సరిలేరు నీకెవ్వరూ” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవలే సినిమా తొలి షెడ్యూల్‌ కాశ్మీర్‌లో ప్రారంభ‌మైంది. కొన్ని కీల‌క స‌న్నివేశాలతో పాటు, యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఇటీవ‌ల మ‌హేశ్ ఆర్మీ ఆఫీస‌ర్ లుక్ ఇదేనంటూ ఫొటో ఒక‌రు వైర‌ల్ అయ్యింది. కాగా.. బుధ‌వారం ఈ సినిమాలో మ‌హేశ్ గురించి మ‌రో కొత్త అప్‌డేట్ ఇచ్చారు ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి, నిర్మాత అనీల్ సుంక‌ర. ఈ సినిమాలో మ‌హేశ్ పేరుని ఆయ‌న‌ సూప‌ర్ హిట్ చిత్రాల్లోని దూకుడు నుండి అజ‌య్.. పోకిరి కృష్ణ‌మ‌నోహ‌ర్‌లో కృష్ణ పేరును మిక్స్ చేసి ఈ సినిమాలో ఈ చిత్రంలో అజ‌య్ కృష్ణ‌గా పెట్టారు. మ‌హేశ్ నేమ్ ప్లేట్ ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన ద‌ర్శ‌క నిర్మాత‌లు.. సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల‌వుతుంద‌ని తెలిపారు.

Related posts