ప్రస్తుతం మన దేశంలో 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో తమిళనాడు కూడా ఉంది. అయితే 2019 తెలంగాణలో జరిగిన ఎన్నికలో కూడా నిజామాబాద్ లో కవితకు వ్యతిరేకంగా దాదాపు 160 మంది రైతులకు పైగా నామినేషన్లు వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే సిన్ తమిళనాడులో రిపీట్ అవుతుంది. ఏప్రిల్ 6 వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలక నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. పార్టీలతో పాటుగా రైతులు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తిరునల్వేలి జిల్లాలోని అంబాసముద్రం నియోజక వర్గంలో పార్టీ నేతలతో పాటుగా రైతులు, సామాన్యులు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అంబాసముద్రం నియోజక వర్గానికి చెందిన గవాస్కర్ అనే రైతు అరటిగెలతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలో వరిపంటతో పాటుగా అరటి పంట ఎక్కువగా పండిస్తారని, వరిపంటను కొనుగోలు చేసే కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అరటిపంటను కొనుగోలు చేసే కేంద్రాలను ఏర్పాటు చేయలేదని, దానిని నిరసిస్తూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు గవాస్కర్ పేర్కొన్నారు. చూడాలి మరి ఈ ఎన్నికలో ఏం జరుగుతుంది అనేది.