telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ఇళ్లలోనే భక్తుల బోనాలు..కళతప్పిన ఉజ్జయిని మహాంకాళీ ఆలయం

ujjaini mahankali temple

ప్రతి సంవత్సరం ఎంతో అట్టహాసంగా జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు కళతప్పాయి. కరోనా ప్రభావంతో భక్తులు ఇళ్లోనే బోనాలు సమర్పించుకుంటున్నారు. ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో ఆదివారం ఉదయం ఆషాఢ బోనాలు ప్రారంభమయ్యాయి. భక్తులు లేకుండా అధికారులు, అర్చకుల సమక్షంలో మాత్రమే ఆలయంలో బోనాల జాతర జరగడం చరిత్రలో ఇదే మొదటిసారి.

కరోనా నేపథ్యంలో అధికారుల ఆదేశాల మేరకు భక్తులందరూ ఇళ్లలోనే బోనాలు జరుపుకుంటున్నారు. ఆలయ అధికారులు పండితుల సమక్షంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు నిర్వహిస్తున్నారు. మొదటగా గోల్కొండలో బోనాల పండుగ మొదలవుతుంది. తర్వాత హైదరాబాద్‌, సికింద్రాబాద్ అన్ని ప్రాంతాల్లో బోనాల జాతర జరగడం ఆనవాయితీగా వస్తుంది.

Related posts