telugu navyamedia
క్రీడలు వార్తలు

మైకేల్ వాన్ ట్విట్ పై పేలుతున్న జోకులు…

అంతకముందే రెండు మ్యాచ్ లలో ఇంగ్లాండ్ పై ఓడిపోయిన భారత్ నిన్న జరిగిన తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించింది. దాంతో ఈ ఐదు టీ20ల సిరీస్‌ను 2-2 తో సమం చేసి టైటిల్ ఫైట్‌కు రెడీ అయింది. అయితే ఈ విజయం పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మరోసారి తన పద్దతిలో ట్విట్ చేసాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీని తక్కువ చేస్తూ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా భారత జట్టులో సగం మంది ముంబై ఇండియన్స్ ఆటగాళ్లే ఉన్నారని పేర్కొని భారత అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అద్భుతమని, సరైన సమయంలో రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించడం జట్టుకు లాభం చేకూర్చిందని వాన్ అన్నాడు. అలాగే జట్టులో ఉన్న ‘సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కెప్టెన్ రోహిత్ శర్మ ముగ్గురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లే.’అని పేర్కొన్నాడు. అయితే దీనికి ట్విటర్ వేదికగా భారత దిమ్మతిరిగే బదులిస్తున్నారు. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లే అయినా భారత్‌కు చెందినవారేనని కానీ, ఇంగ్లండ్ మాత్రం ఇతర దేశాల ఆటగాళ్లతో బరిలోకి దిగుతుందని చురకలంటిస్తున్నారు. ‘ఇయాన్ మోర్గాన్-ఐర్లాండ్, బెన్ స్టోక్స్-న్యూజిలాండ్, జోఫ్రా ఆర్చర్-వెస్టిండీస్, క్రిస్ జోర్డాన్-వెస్టిండీస్, రషీద్ -పాకిస్థాన్, జాసన్ రాయ్-సౌతాఫ్రికా.. మీ జట్టులో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎంత మంది? అని వాన్‌ను ప్రశ్నిస్తున్నారు.

Related posts