telugu navyamedia
క్రీడలు వార్తలు

రోహిత్ కారణంగానే రాణించాను : శార్దూల్

నిన్న అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా చెలరేగిన టీమిండియా 8 పరుగులతో తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఇంగ్లండ్ విజయానికి చివరి 24 బంతుల్లో 46 పరుగులు అవసరమైన దశలో గాయంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానం వీడగా.. రోహిత్ శర్మ జట్టును నడిపించాడు. అప్పటికే జోరు మీదున్న బెన్ స్టోక్స్, ఇయాన్ మోర్గాన్‌లను శార్ధూల్ ఠాకూర్ సాయంతో రోహిత్ పెవిలియన్ చేర్చాడు. అయితే ఆఖరి ఓవర్‌లో ఇంగ్లండ్ విజయానికి 23 పరుగులు అవసరం కాగా.. శార్థూల్ బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ 4, 6 బాదడంతో ఉత్కంఠ పెరిగింది. అతనికి తోడు తీవ్ర ఒత్తిడికి లోనైన శార్దూల్ వరుసగా రెండు వైడ్లతో ఇంకాస్త టెన్షన్ పెట్టాడు. ఈ క్రమంలో శార్దూల్‌కు రోహిత్ శర్మ అండగా నిలిచాడు. తర్వాత మూడు బంతులను కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన శార్దూల్ భారత్‌కు అద్భుత విజయాన్నందించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఇచ్చిన సలహాతోనే తాను రాణించగలిగానని.. మైదానం ఓ వైపు బౌండరీ తక్కువ దూరంలో ఉందని అది దృష్టిలో పెట్టుకుని బంతులేయమని రోహిత్ తెలిపినట్లు మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ శార్దూల్ ఠాకూర్ తెలిపాడు.

Related posts