telugu navyamedia
క్రీడలు వార్తలు

వార్నర్ ను తీసేసి విలియమ్సన్‌ ను పెట్టండి అంటున్న సెహ్వాగ్…

నిన్న చెన్నైసూపర్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్లతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్(57 బంతుల్లో 55) స్లో బ్యాటింగ్ టీమ్ విజయవకాశాలను దెబ్బతీసింది. అయితే ఈ మ్యాచ్ పై సెహ్వాగ్ మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వార్నర్ బ్యాటింగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై అతను మరింత స్వేచ్చగా ఆడాల్సిందన్నాడు. ‘బ్యాటింగ్ చేసేటప్పుడు డేవిడ్ వార్నర్ ఆలోచన విధానం చాలా చెత్తగా ఉంది. ఎవరూ కూడా అతను ఇంత నెమ్మదిగా ఆడుతాడని ఊహించలేదు. అతని బ్యాటింగ్ ఏ మాత్రం ఆకట్టుకోలేదు. వార్నర్ ఎలాంటి సంకోచం లేకుండా చాలా స్వేచ్చగా ఆడాల్సింది. డేవిడ్ వార్నర్ కెప్టెన్సీపై కూడా సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఆరంభంలోనే వికెట్లు రాబట్టే విషయంలో కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ విఫలమయ్యాడని తెలిపాడు. వార్నర్ కెప్టెన్సీపై వేటు వేసి కేన్ విలియమ్సన్‌ను సారథిగా నియమించుకోవాలని సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సూచించాడు. ‘ఓ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌కు ఏ మాత్రం రేటింగ్ ఇవ్వను. సీజన్ ఆరంభంలో కెప్టెన్‌గా అద్భుతం చేసిన వార్నర్.. సీఎస్‌కేతో మ్యాచ్‌లో మాత్రం విఫలమయ్యాడు. కేన్ విలియమ్సనే కెప్టెన్‌గా ఉంటే అతను ఏదో ఒకటి విభిన్నంగా చేసేవాడు. ఎందుకంటే వికెట్లు తీయకుంటే మ్యాచ్ గెలవమనే విషయం అతనికి తెలుసు.’అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

Related posts