తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏపీ సీఎం జగన్ ఈ రోజు మరోసారి సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వేదిక కానుంది. సీఎం వైఎస్ జగన్ జెరుసలేంకు వెళ్లనున్న విషయం విదితమే. అయితే ఈ ప్రయాణానికి ముందు కేసీఆర్‌ను ఏపీ సీఎం కలవనున్నారు. ఈ భేటీ వ్యవహారం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఢిల్లీలో ఇరు రాష్ట్రాల అధికారుల భేటీ సందర్భంగా చర్చించాల్సిన అంశాల అజెండాను ఈ సందర్భంగా ఖరారు చేయనున్నారు. ఈ సమావేశంలో విభజన అంశాలు, నీటి పంపకాలపై కీలక చర్చ జరిగే అవకాశముంది. అయితే త్వరలో యాదాద్రిలో జరిగే యాగం గురించి జగన్‌కు కేసీఆర్ వివరించనున్నారు. అంతకు ముందు తెలంగాణ గవర్నర్ నరసింహన్ ను ఆయన కలిశారు. రాజ్ భవన్ లో వీరిద్దరి మధ్య గంటసేపు చర్చలు జరిగాయి.
దాడులు చేయడం ఈ ప్రభుత్వానికి అటవాటే: గోరంట్ల