telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో మార్పులు

After 11 Parishat Elections Telangana

తెలంగాణ లో రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్ జారీ చేయడంతో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ సారి నామినేషన్ల ప్రక్రియలో మార్పులు చేశారు. ఎంపీటీసీలు గ్రామాల్లో, జెడ్పీటీసీలకు పోటీచేసేవారు మండల కేంద్రాల్లో నామినేషన్లు సమర్పించేలా నిబంధనలు మార్చారు. తొలి దశలో 197 జెడ్పీటీసీ స్థానాలకు, 2,166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

ఎన్నికలు సజావుగా జరిగేందుకు మండలాలవారీగా రిటర్నింగ్ అధికారులను నియమించారు. మండల కేంద్రాలు, ఎంపీటీసీ స్థానాల్లో రిటర్నింగ్ అధికారులు సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రాదేశిక నియోజకవర్గాలవారీగా తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు. అనంతరం నామినేషన్లను స్వీకరించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ నెల 24 (బుధవారం) వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 25న నామినేషన్ల పరిశీలనఅనతరం అదే రోజున బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు.

Related posts