telugu navyamedia
రాజకీయ వార్తలు

అఫ్గానిస్థాన్‌ అధ్యక్షుడు అష్రాప్‌ ఘనీతో ట్రంప్‌ భేటీ

trump in america president election race

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ థ్యాంక్స్‌ గివింగ్‌ రోజును పురస్కరించుకొని ఆయన అఫ్గానిస్థాన్‌లో తొలిసారి పర్యటించారు. బగ్రామ్‌ వైమానికి క్షేత్రంలో అమెరికా సైనికులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా అఫ్గానిస్థాన్‌ అధ్యక్షుడు అష్రాప్‌ ఘనీతో ట్రంప్‌ భేటీ అయ్యారు. అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ తాలిబన్లు ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నారు. మేం వారితో సమావేశమవుతున్నామన్నారు.

కాల్పులను విరమించాలని చెబుతున్నామని తెలిపారు. గతంలో అందుకు వారు అంగీకరించలేదు. ఇప్పుడు మాత్రం సరేనంటున్నారు. కాబట్టి సానుకూల ఫలితం ఉంటుందనుకుంటున్నా అని చెప్పారు. శాంతి చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయన్న విషయంపై తామిప్పుడే స్పందించబోమని తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ పేర్కొన్నారు.

Related posts