telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

బ్రేకింగ్‌ : ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ భూకంపం..

4 earthquakes in arunachal pradesh

ఉత్తరాఖండ్‌, ఒడిశా రాష్ట్రాల్లో ఇవాళ తెల్లవారుజామున ఒక్కసారిగా భూకంపం సంభవించింది. ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌ భంజ్‌ పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున 2:13 సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 3.9 గా నమోదైంది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని పితోరాఘడ్‌ ప్రాంతంలో ఇవాళ ఉదయం 3:10 గంటలకు భూమి కంపించింది. పితోరాఘడ్‌ భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 2.6 గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెస్మోలాజీ శాస్త్రవేత్తలు చెప్పారు. ఒడిశా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూ ప్రకంపనలతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో గతంలోనూ భూమి పలుసార్లు కంపించింది.ఆ సమయంలోనూ పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం లాంటివి ఏది జరగలేదు. ఈ సారి కూడా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు కాస్త భయాందోళనలను గురైయ్యారు. దీనికి కారణం తెలుసుకున పనిలో పడ్డారు అధికారులు.

Related posts