దేశ రాజధాని ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. భవన్‌లోని డి బ్లాక్‌లో ఇవాళ మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఐదు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.
పట్టపగలు అగ్నిప్రమాదం జరగడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. శాస్త్రి భవన్‌లో గత రెండు నెలల కాలంలో అగ్నిప్రమాదం జరగడం ఇది రెండోసారి. ఏప్రిల్ 30వ తేదీన కూడా శాస్త్రి భవన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.
జగన్తో కేసీఆర్ కొత్త బంధాలు: లక్ష్మణ్