telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షారూఖ్ ఇల్లు “మన్నత్”లో ఒక గది అద్దె ఎంతంటే…?!

Sharukh

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న ఈ షారూఖ్ ను ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాపులు పలకరిస్తున్నాయి. షారుఖ్ చివ‌రిగా “జీరో” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం షారూఖ్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అయితే షారూక్ ఖాన్‌కి ఈ ప్రపంచంలో అత్యంత ఇష్టమైన ప్రదేశం ఏదో తెలుసా? ముంబైలో ఉన్న ఆయన ఇల్లు `మన్నత్`. దాదాపు 200 కోట్ల రూపాయల విలువ చేసే ఈ బంగ్లాలో ఉన్న ఏదైనా ఒక గదిలో ఒక రోజు ఉండాలంటే అద్దె ఎంత కట్టాలో తెలుసా? తాజాగా ట్విటర్ ద్వారా లైవ్‌ఛాట్‌లోకి వచ్చిన షారూక్‌ను ఓ అభిమాని ఇదే ప్రశ్న అడిగారు. ‘మన్నత్’లో ఒక గది అద్దె ఎంతుంటుంది?` అని ఓ అభిమాని షారూక్‌ను ప్రశ్నించారు. దీనికి స్పందించిన షారూక్.. `30 సంవత్సరాల కఠోర శ్రమ అంత ఉంటుంది` అని సమాధానమచ్చి నెటిజన్ల ప్రశంసలు అందుకున్నాడు. అలాగే `వరుసగా మీ సినిమాలన్నీ విఫలమవుతున్నాయి కదా? మీరు ఏమనుకుంటున్నారు?` అని మరో అభిమాని ప్రశ్నించారు. దీనికి స్పందించిన షారూక్.. `మీరు ప్రార్థించేటపుడు నా గురించి కూడా కోరుకోండి` అని సమాధానం ఇచ్చాడు.

Related posts