telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పెద్దిరెడ్డి, సజ్జల పేర్లలోనే రాముడు ఉన్నాడు : సోము వీర్రాజు

తిరుపతి ఉప ఎన్నిక నిన్న జరిగిన విషయం తెలిసిందే. ఏయితే ఈ ఉప ఎన్నికలో దొంగ నోట్ల కలకలం రేపింది. దీంతో అధికార పార్టీ పై విపక్షాలు మండిపడుతున్నాయి. YCP ఓటమి భయంతోనే ఇలా చేసిందని ఫైర్ అవుతున్నాయి. అయితే తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. YCPపై ఫైర్ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నికల్లో రీ-పోలింగ్ జరపాలని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏజెంట్లు బెదిరించారని…వలంటీర్ వ్యవస్థ ద్వారా ఓటర్లను బెదిరించిందని ఫైర్ అయ్యారు సోము వీర్రాజు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధులకు ఓట్లు వస్తే మా బతుకులు ఏమవుతాయని 40 శాతం ఓటర్లు భయపడ్డారని..తిరుపతి ఎన్నికల్లో అధికార పార్టీ బరితెగించిందన్నారు. బయట నియోజకవర్గాల నుంచి దొంగ ఓటర్లను రప్పించారని.. వైసీపీకి ఇంతటి ప్రజాదరణ ఉంటే 150 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది..? అని ప్రశ్నించారు. దొంగ ఓటర్లను అడ్డుకున్నది బీజేపీనేనని…మేం అడ్డుకున్న తర్వాతే 14 ఏళ్లు అధికారంలో, పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకి ధైర్యం వచ్చిందని టిడిపికి చురకలు అంటించారు. రామచంద్రారెడ్డి, రామకృష్ణ రెడ్డి ఇద్దరి పేర్లల్లోనూ రాముడు ఉన్నాడని…రాముడు ఎప్పుడు అబద్దం చెప్పడు.. కానీ వీళ్లద్దరి నోటి వెంబడి అన్నీ అబద్దాలేనని పేర్కొన్నారు. టీడీపీ-బీజేపీ కుమ్మక్కంటూ అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చర్యలు తీసుకోవాల్సిన డీజీపీ ఏదేదో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

Related posts