telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ట్యాంక్ బండ్ పై ఘోర ప్రమాదం : కారు బోల్తా..స్వల్ప గాయాలు

రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా.. ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే..తాజాగా   హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైన కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారు మాత్రం ప్రస్తుతం సేఫ్ గా ఉన్నట్లు సమాచారం. ఖైరతాబాద్ వైపు నుంచి తెలుగు తల్లి ప్లైవర్ వైపు వెళ్తుంటే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓవర్ స్పీడు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది. ఢీ-వైడర్ ను ఢీ కొని రోడ్డుపై కారు బోల్తా పడింది. అదృష్టవశాత్తు తృటిలో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు..అక్కడి నుంచి కారును తొలగించారు. అలాగే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..

Related posts