telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జర్నలిస్టులకు  రూ . 25 లక్షలు ప్రకటించాలి : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కరోనా మహమ్మారి విజృభిస్తున్నప్పటి నుండి  ఇప్పటివరకు తెలంగాణాలో 100 మంది జర్నలిస్టులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. దేశం మొత్తంలో దాదాపు  పదిహేను రాష్ట్రాలలో జర్నలిస్టులను “ఫ్రంట్ లైన్ వారియర్స్ ” గా గుర్తించారని… వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ఉచిత వైద్యం రాష్ట్ర ప్రభుత్వాలు చేయిస్తున్నాయని వెల్లడించారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు ఇతర రాష్ట్రాలు ఆర్ధిక సహాయం కూడా చేస్తున్నాయని… కాబట్టి  కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబానికి తక్షణమే  తెలంగాణ ప్రభుత్వం రూ .25 లక్షల ఆర్ధిక సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  నిత్యం ప్రజల కోసం పని చేసే జర్నలిస్టులను మనం కాపాడుకోవాలసిన అవసరం వుందని… ఈ  క్లిష్ట పరిస్థితుల్లో వారి ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. కరోనాతో జర్నలిస్టులు చనిపోతే వారి కుటుంబానికి  రూ . 25 లక్షల ఆర్ధిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ కు విజ్ఞప్తి  చేశారు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.  ఇతర రాష్ట్రాలను స్ఫూర్తి గా తీసుకొని , తెలంగాణ ప్రభుత్వం కూడా తక్షణమే జర్నలిస్టులను “ఫ్రంట్ లైన్ వారియర్స్ ” గా గుర్తించాలని… వారికి ప్రత్యేకంగా బెడ్లు కేటాయించి, ప్రైవేట్ ఆసుపత్రులో  ఉచిత వైద్యం తెలంగాణ ప్రభుత్వం చేయించాలని డిమాండ్ చేశారు.  

Related posts